Categories
గ్రేప్స్ ప్యాక్ తో చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ద్రాక్షలో చర్మానికి పోషణ అందించే విటమిన్-సి,ఎ,బి6 ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి.వీటిలోని ఆంథోసైయానిన్,యాంటీ ఆక్సిడెంట్లు మొహం పైన మొటిమలు వాటి తాలూకు మచ్చలను తొలగిస్తాయి. పది నల్ల ద్రాక్ష పండ్లను పేస్టులా చేసి ఆ పేస్ట్ లో టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మానికి ఇన్స్టంట్ మాయిశ్చరైజర్ ని అందించి మృదువుగా చేస్తుంది.