Categories
నలభై ఏళ్ళ వయసులో ఎవరైన చక్కగా ఉంటారు. అటు చిన్న తనం పోయి ,ఇటు వార్ధక్యం రాని మంచి వయసు .ఆడవాళ్ళు ఈ వయసులో పోర్స్ ఎన్ లార్జ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. వయసు పెరిగే కొద్దీ ఈ ముఖ రంధ్రాలు పెద్దవిగా కనిపిస్తాయి.ఓట్స్ తో కొద్దిగా మాయిశ్చ రైజర్ కలిపి ఓ నిమిషం పాటు మసాజ్ చేస్తే మృత కణాలు పోతాయి. మృతకణాల పైన ఉండే రంధ్రాలు చుట్టు పేరుకో బట్టే ఆ పోర్స్ పెద్దవిగా కనిపిస్తాయి. ఇలా ప్రతి రోజూ ఓట్స్ మసాజ్ చేసి గోరు వెచ్చని నీళ్ళతో కడిగేస్తూ ఉంటే ముఖం తేటగా ,నలభైల్లోనూ యవ్వన కాంతులతో ఉంటుంది.