వర్షాలు బాగా పడుతూ వున్నాయి. ఇంటికి సంబంధించి ఈ సీజన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో తేమ హ్యుమిడిటి అరికట్టేందుకు లీకింగ్ ట్యాప్స్ పైప్స్ వంటివి వుంటే రిపేరు చేయించాలి. ఇంట్లో తేమ వ్వుండదు. ఆస్మా వంటి అనారొగ్యాలు రాకుండా ఉంటాయి. మాయిశ్చర్ చెక్క పర్నీచర్ కు హాని కలిగిస్తుంది. కొన్నాళ్ళు వాటిని వాడకుండా పక్కన పెట్టేయడం మంచిది. లెదర్ సోఫాలు క్లీన్ గా వుంచుకోవాలి. గాలిలో తేమ వాటి పై బుజు మాదిరి ఏర్పడటానికి దారి తీస్తుంది. దొర మ్యాట్స్ మురికి పడతాయి వీటిని క్లీన్ చేస్తూ వుండాలి. బాక్టీరియా ఎక్కువగా చేరిపోతుంది కనుక వీలైనంత పొడిగా వుండాలి. ఇంటిని కుడా ఏ మాత్రం తడిలేకుండా ఎప్పటికప్పుడు తుడిచేస్తూ వుంటే వర్షాకాలం అనారోగ్యాలు రావు.

Leave a comment