చర్మం సాగే గుణాన్ని పొగొట్టుకొంటూ ఉంటే వార్ధక్యాపు చాయలు కనిపిస్తాయి అలా మెరుపు తగ్గకుండా యవ్వనవంతమైన చర్మం కోసం మంచి ఆహారం ఉంది. బొప్పాయిని సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ,విటమిన్స్ ,మినరల్స్ చర్మం సాగే గుణాన్ని కోల్పోకుండా చేస్తాయి. పాలకూరలో ఉండే ఎ,సి,ఈ,కె, విటమిన్లు, మెగ్నిషియం,ఇనుము, చర్మ ఆరోగ్యానికి సాయపడుతాయి. పాలకూరలోని విటమిన్ సి కొలాజిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.వాట్ నట్స్ లోని ఈ విటమిన్ చర్మానికి తేమను అందిస్తుంది. వాట్ నట్స్ లోని ఒమెగా త్రీ ఫ్యాట్ ఆమ్లాలు, చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఎండ నుంచి చర్మానికి రక్షణ ఇస్తాయి. వీటిని నానబెట్టి తింటే మంచిది. అలాగే దానిమ్మ,చిలకడ దుంపలు కూగా చర్మానికి మెరుపుతో ఉంచేందుకు తోడ్పడతాయి.

Leave a comment