చీర ఎప్పుడు ఫ్యాషనే. ఏ సందర్భానికైన చూడటానికి ఎప్పుడు చక్కగానే కనిపిస్తుంది.కాని శరీరాకృతిని బట్టి చీరె ఎంచుకోవాలి అంటారు ఎక్స్ పర్ట్స్. సన్నగా ఉండే వాళ్ళు కాటన్ పట్టు చీరెలు,లావుగా ఉండే వాళ్ళు తేలికైన చాందిని మైసూరు సిల్క్ ఎంచుకుని కట్టుకుంటే బావుంటుంది.ఆధునిక స్టైల్ కావాలంటే పొడవైన బ్లౌజ్ ఎడం వైపు వచ్చేలా కుచ్చిళ్ళు వేసుకుంటే చాలు.సంప్రదాయ చీరెకట్టుతో పాటు గుజరాతీ,హైదరాబాదీ,రాజస్థానీ,బెంగాళ్ ల్లో లా రకరకాల చీర కట్టుతో అందంగా ముస్తాబు అవ్వచ్చు.ఒక్క రోజులో 370 రకాల చీరకట్లు ప్రదర్శించి ప్రపంచ రికార్డ్ సృష్టించింది కోల్ కత్తా కి చెందిన డాలి జైన్. ఈ వేసవికి అందమైన కాటన్ చీరెలతో గడపమంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment