Categories
కోజికోడ్ కు చెందిన హెన్నా ఫ్యాషన్ డిజైనర్ కమలాదాస్ కవిత్వం ఆమెకు చాలా ఇష్టం. ఆ ఇష్టం తో ఆమె ఒక ట్రెండ్ సెట్ చేసింది. చీరెల డిజైన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కవిత్వాన్ని చీరెలపై ముద్రిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. బాగా ఆలోచించి కమలాదాస్ రచనలను చీరెపై ప్రింట్ చేసింది. ఆ చీరెలు ఊహించనంత మంది కి నచ్చేసి ట్రెండ్ సెట్ చేశాయి. కవిత్వం నిండిన ఆ చీరెల్ని కేరళ కవిత్వ ప్రేమికులైన స్త్రీలు గుండెలకు హత్తుకున్నారు.