Categories
వేసవి ఎండలకు తలలో చమటలు పోస్తాయి. తరుచూ తల స్నానం చేస్తూ ఉంటే మాడుపైన సహాజంగా ఉండే నూనెలు ఆవిరై జుట్టు పొడిబారీ పోతూ ఉంటుంది.కఠిన రసాయనాలున్న షాంపూలకు దూరంగా ఉండాలి. హెయిర్ డైలు ,స్టైలింగ్ ఉత్పత్తులు కాస్త తక్కువ సార్లే వాడాలి. పిహెల్ శాతం 5 లేదా 5.5 శాతం ఉన్న షాంపులనే ఎంచుకోవాలి. తలస్నానానికి ముందు జూజూబీ ,లావెండర్ టిట్రీ వంటి ఎసెన్షియల్ నూనెలో కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు రాసుకోని మర్ధన చేయాలి. చల్లని నీటితో స్నానం చేయాలి. సరైన పోషకాహరం తీసుకోవాలి.తలస్నానం చివరలో కండిషనర్ ఉపయోగించాలి.