Categories
కాస్టిక్ డిటర్జెంట్ కు కొవ్వులు లేదా నూనెలు కలిపి సబ్బులను తయారు చేస్తారు.ఈ సబ్బుల్లో రసాయనాల వల్ల దురదలు, దద్దుర్లు వస్తూ ఉంటాయి.నాణ్యమైన కొవ్వులు కొబ్బరి నూనె ఆలివ్ నూనె వాడి తయారు చేసే సబ్బుల వల్ల అలర్జీలు రావు. మంచి సబ్బులు అనుకోవాలి అంటే పి హెచ్ బ్యాలెన్స్ ఉన్న సబ్బుల్ని ఎంచుకోవాలి.బాడీ వాష్ షవర్ జెల్స్ ,జెనెటిక్ క్లెన్సర్ల లో అంత ప్రమాదం కలిగించే రసాయనాలు తక్కువే ఉంటాయి.సబ్బుల వల్లనే శరీరం శుభ్రంగా ఉంటుందని అనుకోనక్కర్లేదు. సున్నిపిండి లో మీగడ కలిపి స్క్రబ్ గా ఉపయోగిస్తే కూడా చర్మం చక్కగా మెరుపుతో ఉంటుంది.గోరువెచ్చని నీళ్లను స్నానానికి ఉపయోగిస్తే సున్నిపిండి, జెనటిక్ కేన్సర్లు వాడితే మేలు.