నీహారికా,
నా స్నేహితులు నా చుట్టూ ఉన్నప్పుడే నేను భద్రంగా, సుఖంగా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నావు, చాలా కరెక్ట్. స్నేహితులు లేకుండా మనసుని పంచుకోనేవాళ్ళు లేకుండా జీవితం సమగ్రంగా ఉండదు. మన బాధలు, సంతోషాలు వాళ్ళతో పంచుకొంటేనే మనం పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తాం. అందుకే ఎంత పని ఒత్తిడి వున్నా గంటో, అరగంటో వాళ్ళ కోసం కేటాయించి తీరాలి. స్నేహితులు చెప్పేది శ్రద్ధగా వినాలి. మొత్తం మనమే మాట్లాడాలని కూడా అనుకోకూడదు. వాళ్ళ మాటలకీ ప్రాధన్యం ఇవ్వాలి. మరి స్నేహితులను కోరుకుంటే వాళ్లకు ప్రత్యేకత ఇవ్వాల్సిందే కదా. అలాగే ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకునేందుకు ముందుండాలి. వాళ్ళకు వచ్చిన కష్టం ఏదో తెలుసుకుని ధైర్యం చెప్పాలి. వాళ్ళా ఆపదలోంచి బయటకు వచ్చేదాకా ఫోన్ లో టచ్ లో ఉండాలి. మనతో అయ్యే ఎలాంటి సాయం అయినా చేయాలి. ఒక్కోసారి ఫ్రెండ్స్ కు నచ్చింది మనకు నచ్చకపోవచ్చు, వెంటనే నాకు నచ్చలేదు అనక్కర్లేదు. ఎదుటి వాళ్ళ అభిప్రాయాలకు విలువిస్తేనే స్నేహం నిలబడేది. అలాగే కొన్ని పొరపాట్లు జరగచ్చు.అప్పుడూ ఆ పొరపాటు గురించి చక్కగా మాట్లాడుకొని, చర్చించుకొని పరిష్కరించుకోవాలే గానీ స్నేహాలు పోగొట్టుకోకూడదు.