పాతికేళ్ళు కూడా దాటక ముందే పది అడుగులు వేయలేక పోతున్నాను ,అసలు నడవాలంటే గుండె గొంతులోకి వస్తుంది అంటున్నారు యువతరం. నిజమే అలవాటు లేకపోవటం ,టూ వీలర్స్ ,ఫోర్ వీలర్స్ వాడకం ఎక్కువై కాస్త దూరం కూడా నడవలేకపోవటం ఈ సమస్యకు కారణం.లిఫ్ట్ వాడకంతో మెట్లు ఎక్కే పని లేదు. నడక ఆరోగ్యానికి మేలు చేస్తుందని డాక్టర్లు చెప్పినా పట్టించుకోరు.నడక బరువును నియంత్రిస్తుంది.మానసిక స్థితిని అదుపులో ఉంచుతుంది.శరీరంలో కొవ్వు తగ్గిపోతుంది. రక్త పోటు నియంత్రణలో ఉంటుంది.ఒత్తిడి ఉండదు. ఎముకలు గట్టిపడతాయి.శరీర కండరాలు సమతూలంగా ఉంటాయి.గుండెపోటు రాదు.మరి ఇన్ని లాభాలు ఉండే నడక ఎందుకు వద్దనుకోవటం ?.

Leave a comment