Categories
ఈ మధ్య కాలంలో కారణాలు ఎమైనప్పటికీ ఆడపిల్లలు చాలా త్వరగా పన్నెండేళ్ళకే రజస్వల అవుతున్నారు. ఇంకా త్వరగాను అంటే ఐదారు తరగతులు చదివే వయసులోనూ కావచ్చు. ఇది చాలా సహజమైన ప్రక్రియ అని కంగారుపడరాదని పిల్లలకు శరీర ధర్మాన్ని అర్ధమయ్యేలా వివరించాలి. చేయకూడని పనులన్ని వాళ్ళకు చెప్పేసి కంగారు పెట్టోద్దు. మంచి శానిటరి ప్రత్యమ్నాయాలు వారికి ఉన్నాయి కనుక వాళ్ళు సౌకర్యంగా ఫీలవుతారు. శారీరకంగా ఏదైనా అలసట అనిపిస్తేనే వారిని విశ్రాంతి తీసుకొమ్మని చెప్పాలి. లేకపోతే వాళ్ళకు మాములు రోజుల్లోలాగే హాయిగా ఆటలాడుతూ రోజువారి చదువుల్లో మునిగిపోతారు.