చేత్తో చేసే నల్లని మట్టి పాత్రలను లాంగ్ పీ పాటరీ లేదా రాయల్ పోటరీ అంటారు. మణిపూర్ లో ఎత్తైన కొండ శిఖరం పైన ఉన్న ఊఖ్రూల్ దగ్గరలోని లాంగ్ పీ కొండ గ్రామాల్లో నివశించే థంకూల్ నాగా తెగ ఈ పాత్రతో చక్రంతో పనిలేకుండా వట్టి చేత్తో తయారు చేస్తారు. ధర కాస్త ఎక్కువే ఈ గ్రామంలో దోరికే సెర్పంటైన్ అనే నల్లరాతిని పొడి చేసి అక్కడ దోరికే గోధుమరంగు మట్టిని కలిపి చేత్తోనే రకరకాల పాత్రలు చేస్తారు. ఇక్కడ స్థానికంగా దోరికే చిరాన్ అనే ఆకురసంతో రుద్ది పాలీష్ చేస్తారు. ఈ పాత్రలతో తయారు చేసే ఆహారం ఆరోగ్యంగా ఉంచుతుందట. వంటింటికి కావలిసిన అన్ని రకాల పాత్రలు ఈ మట్టితో అందంగా తయారు చేస్తాం.