చేతులు అందంగా కోమలంగా ఉండాలంటే మానిక్యుర్ తప్పనిసరి కానీ ప్రతి సారీ క్లినిక్స్ కు వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. సొంతంగా ఇంట్లోనే మానిక్యుర్ చేసుకుంటే అన్ని వేళలా చేతులు గోళ్ళు తళతళ తాడుతూ ముడతలు పడకుండా ఉంటాయి. నీళ్ళలో చేతులు ఐదు నిమిషాల పాటు ముంచి వుంచాలి. స్క్రుబ్ చేసి మ్రుతకణాలు తొలగించాలి. మానిక్యుర్ కోసం ఉద్దేసించిన హ్యాండ్ స్క్రుబ్ లు, బాడీ స్క్రుబ్ లు వుపయోగించాలి లేదా బేబీ ఆయిల్ లో ఓ స్పూన్ పంచదార వేసి స్క్రబ్ చేసినా బాగా పని చేస్తుంది.పొడిబారిన పగిలిన చర్మం ఈ స్క్రబ్ వల్లన మృదువుగా అవుతుంది. గోళ్ళు చక్కగా కట్ చేసుకోవాలి. ముఖం మెడలకు మాదిరిగానే చేతులకు మాస్క్ లు ఎంచుకుని గ్లావ మాదిరిగా వుండే మస్క్ ల్ని చేతులకు వేసుకోవచ్చు. దీనివల్ల మృదువైన చర్మం సొంతం అవుతుంది.

 

Leave a comment