Categories
![సంగీతం ఎందుకు ఆనందపెడుతోంది. పశువులూ శిశువులూ కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయంటారు ఎందుకూ ? అంటే సమాధానం దొరికింది. సరిగామలతో ఆహ్లాద పరిచే భారతీయ సంగీతమైనా కోరేమీ అంటూ సాగే పాశ్చాత్య సంగీతమైనా వినగానే మెదడు లోని డోపమైనను ఈ ధ్వనులు నియంత్రించటం వల్ల సంతోషం కలుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. కొంతమందికి మనసుకు నచ్చిన సంగీతంతో తమ కోపాల్ని భావోద్వేగాలను నియంత్రించుకోగలగటం చిరాగ్గా ఉన్నా సరే సంగీత ధ్వనులు కంతులేని ఆహ్లాదం ఇస్తాయిట. డోప్ మైన్ సంబంధించిన మానసిక సమస్య తో బాధపడేవారికి సంగీతం దివ్యౌషధంలా పనిచేస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. అంతేకాదు మానసిక వత్తిడికి గురైనా ఆందోళన కలిగినా సంగీతం వినటం ద్వారా ఉపశమనం పొందవచ్చునన్నారు.](https://vanithavani.com/wp-content/uploads/2016/12/music.jpg)
ఈ రోజుల్లో హెడ్ ఫోన్స్ వినియోగం చాలా ఎక్కువైంది ఈ హెడ్ ఫోన్స్ లోను ప్లగ్ హెడ్ ఫోన్స్ . వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వంటి ఎన్నో రకాలు మార్కెట్ లో లభిస్తున్నాయి. వాటిలో ప్లగ్ హెడ్ ఫోన్ మరీ ప్రమాదం అంటున్నారు ఎక్సపర్ట్స్. ప్లగ్ ఇయర్ ఫోన్స్ వల్ల చెవిలో నరాలు వత్తిడికి గురై దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. చెవిలో రింగింగ్,ఈలలు ,పెద్దశబ్దాలు వినబడతూ టేన్నిటస్ వ్యాధి వస్తుందని దీని వల్ల అధిక రక్తపోటు తల మెడనొప్పుల వంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందంటున్నారు. ఇయర్ ఫోన్స్ వల్ల కూడా ఇలాటి సమస్యలే వస్తాయంటున్నారు.