పెళ్ళిళ్ళలో ,పార్టీల్లో వేసుకొన్న నగలు కాస్త దూరంగా కూర్చోంటే కనిపించవేమే కానీ గ్లో ఇన్ ది డార్క్ టాటూలు మాత్రం చీకటి పడితే చాలు చమక్ మని మెరుస్తాయి. జంతువులు పక్షులు ,టైబర్ ప్రింట్లు పర్యాటక స్రదేశాలు కూడా ఈ యూవీ ఇంక్ గా పిలిచే టాటూల్లో నక్షత్రాల్లా మెరుస్తాయి. డిమ్ లైట్ పార్టీలు ,కాండిల్ లైట్ డిన్నర్లు అయితే ఇక ఈ టాటూల అందమే అందం. ఎంతో అందమైన నగల కంటే ఆవే చక్కగా కనిసిస్తాయి. ఒంటిపైన వెలుగులు కురపిించే ఈ టాటూలు ఎంతో ఆకర్షణగా ఉన్నాయి. ఈ తరహా స్టిక్కర్లలో దొరికే వెరైటీస్ చూస్తూంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. మెరిసే ఈ టాటూల కోసం ఆన్ లైన్ లో వెతకవచ్చు.