గ్రాండ్ స్లాం ఛాంపియన్ సెరీనా విలియమ్స్ ఇటివల తన పాపయి అలెక్స్ ను సంరక్షణకు తనకు తగిన సమయం దొరకటం లేదంటూ పెట్టిన పోస్ట్ అందరి మనసు కరిగించింది. నేను ఉత్తమ క్రీడాకారిణినే . సందేహం లేదు కాని ఇప్పుడు తల్లిని కూడా ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో పాపాయిల సంరక్షణ చేసుకునే తల్లులు నిజంగా అదృష్టవంతులు. పిల్లలతో గడపడం అనేది ఒక అద్భుతమైన నిజమైన కళ. అలాంటి కళ నేర్చుకునే తల్లులు నిజమైన హీరోలు. నేను ఒకరోజు దాన్ని సాధిస్తాను.కాని నాకు ఇప్పుడు ఇంకో కర్తవ్యం ఉంది. క్రిడా కారిణిగా నన్ను నేను నిరుపించుకునేందుకు ఆటలో నైపుణ్యాలు పెంచుకోవాలి,వ్యయామాలు చేయాలి. వీటితో పాటు తల్లిగా పాపాయిని చూసుకోవాలి.దానికి నాకు సమయం దొరకటం లేదని చెప్పుకోవటం కూడా కష్టంగా ఉంది. నేను మంచి తల్లిగా ఉండలేకపోతున్నాని భయం మొదలైంది. అంటూ పోస్ట్ చేసింది సెరీనా విలియమ్స్. రెండు బరువైన బాధయతల మధ్య నలగటం నిజంగా కష్టమే.

Leave a comment