ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అన్న సామెత తెలిసిందే. గాఢ నిద్ర కోసం విలాసవంతమైన పరుపులు అక్కర్లేదు, కష్ట జీవి అలసిపోయి పడుకొంటే నిద్ర చెప్పా పెట్టకుండా వచ్చి సేదదీరుస్తుందని అర్ధం చేసుకొoటాం, కానీ నిద్రాదేవి ఎక్కువ సంపాదనా పరులను, జీవితంలో అన్ని ఐశ్వర్యాలను అనుభవించే వాళ్ళనే వరిస్తుందని ఇప్పటి రిపోర్ట్. మంచి జీతంతో పనిచేసే ఉద్యోగులు, బాగా ధనవంతులు ఏడెనిమిది గంటల నిద్ర పోగలిగితే ఆదాయం లేని, పేదరికంతో బాధపడేవాళ్ళు అంత సుఖంగా ఏమీ నిద్రపోలేరంటున్నారు. పేదరికంతో ఇబ్బందులు, వాటి వల్ల ఆలోచనలు, అనారోగ్యాలు, చుట్టుముడతాయని, వాళ్ళ జీవితంలో సుఖ శాంతులకు అంత చోటేమీ వుండదని పరిశోధనా సారం. నిద్రలేమికి వేరే ఇతరత్రా అనారోగ్య కారణాలు తీసి పక్కన పెడితే సుఖ నిద్ర మాత్రం ఏ చీకుచింతా లేని వాళ్ళనే వరిస్తుందని పరిశోధకుల రిపోర్ట్ సమర్పించారు.
Categories
WhatsApp

చీకు చింత లేని వాళ్ళకే సుఖ నిద్ర

Leave a comment