నీహారికా,

సంతోషాన్ని నవ్వులతోనూ, పువ్వులతోనూ పోలుస్తారు. అలాగే కోపం, పగ, ప్రతీకారం వంటివి చీకటి తోనో, వడగాల్పు తోనో పోలిక తెస్తారు. ఎందుకంటే ఒక ఆనందం తో పాటు, మంచి ఆలోచన తో పాటు మనిషి ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్స్ చెక్కారు కొడతాయో, కోపంతో పగ, ప్రతీకారం వంటి పదాలు మనస్సులో మెదులుతూ, వున్న కోపాన్ని రెచ్చగొడుతూ మనిషిని తల కిన్డులు చేస్తాయి. మన మనస్సులో ఎవరి పైన అయినా ద్వేషభావం పగ ఉన్నయనుకో అవి ముందు మనల్ని స్థిమితంగా వుండనివ్వవు. అలాగే మన అభివృద్ధి గురించి మన సంతోషం గురించి కూడా ఆలోచించ నివ్వావు. పగ నివురు గప్పిన నిప్పులా ముందు మనల్ని  దహిస్తుంది. ఎదుటి వాళ్ళ వినాశనం కోరుకుంటూ ముందు మన ఆరోగ్యం పోగొట్టుకొంటాము . ఒక్కో సారి ఈ భావాలు వికటించి అవతలి వ్యక్తికి అపకారం చేయాలనుకోవడం, చివరకు చంపేందుకు కూడా వెనుకాడక పోవడం వరుసగా అనుభవంలోకి రావొచ్చు. అందుకే ముందు కోపాన్ని జయిస్తే ఇక దానికి తో బుట్టువుల్లా వచ్చే పగ ప్రతీకారాలు మనస్సులో తలెత్తవు. పగను ప్రేమా తో, శాంతితో, సహనంతో, క్షమతో తరిమికొట్టాలి. కొన్ని నెగటివ్ ఫీలింగ్స్ కు మన ఆలోచనలో కూడా తావివ్వకూడదు.

Leave a comment