ఒక వందగ్రాముల తోటకూరలో 716 క్యాలరీలు దొరుకుతాయంటున్నారు నిపుణులు. ఎప్పుడూ దొరుకుతోంది కనుక సీజన్ మారినప్పుడల్లా తలెత్తే రుగ్మతలను దూరంగా ఉంచగలుగుతుంది తోటకూర.సోడియం ,పోటాషియంలతో పాటు కాపర్ ,కాల్షియం ,మాంగనీస్ ,ఇనుము ,మెగ్నిషియం ,ఫాస్పరస్ జింక్ వంటి ఖనిజాలు లభిస్తాయి.ఆకు కూరల అన్నిటికంటే ఎక్కువ పోషకాలు దక్కుతాయి.ఎ,సి,డి,బి12,బి6,ఇ, కె, విటమిన్లు లభిస్తాయి. ఇందులోని పీచు జీర్ణ శక్తి పెంచుతుంది. అధిక కోవ్వును కరిగిస్తుంది. బి.పి ఉన్న వారికి ఇది మంచి ఆహారం. తప్పకుండా తోట కూరను ఆహారంలో భాగం చేసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment