చేతిరాత పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగుపరచి ఏకాగ్రతను పెంచుతుంది అంటున్నారు అధ్యయనకారులు అక్షరాలు అందంగా రాసేందుకు వారికి శిక్షణ ఇవ్వాలి. రెండు మూడు భాషలకు సంబంధించిన అక్షరాలు వారికి నేర్పించి వారిని భాషల్ని పోల్చి చూసుకోమని చెప్పాలి.అలాగే పిల్లలకు రంగురంగుల పెన్సిల్ లు ఇచ్చి ఒక అక్షరం ఒక రంగులతో అందంగా రాయమని చెప్పాలి పుస్తకంలో ఉండే ప్రధానాంశాల్ని నోట్స్ లో రాయమని చెప్పాలి.ఈ చదవటం, రాయటం అనే అభ్యాసం వాళ్ళలో జ్ఞాపకశక్తి వృద్ధి చేస్తాయి.అందమైన చేతి రాత ను అభ్యాసం చేసే క్రమంలో వాళ్లు బొమ్మలు గీయటం కూడా నేర్చుకునే అవకాశం ఉంది. ఒక అందమైన అక్షరాన్ని రాసే క్రమంలో ఆ అక్షరం యొక్క అందం పిల్లల మనసుకి చేరుతోంది. నెమ్మదిగా కళ్ళకు ఏది చక్కగా కనబడితే దాన్ని గీయటం మొదలు పెట్టే అవకాశం ఉంది కదా !

Leave a comment