Categories

వేసవిలో వచ్చే చెమటకాయలతో పసి పిల్లలు ఎంతో ఇబ్బంది పడతారు. వారిలో స్వేద గ్రంధులు అభివృద్ధి చెందక పోవటం వల్ల ఇవి పుట్టిన వారం లోపు పిల్లలకు వెంటనే వస్తాయి. వాతావరణం లో వేడి వల్ల ఈ సమస్య వస్తుంది. పిల్లలకు వదులుగా,లేత రంగులో తక్కువ బరువున్న కాటన్ దుస్తులు తొడగాల కలబంద గుజ్జు వేపాకులు మెత్తగా నూరి రాసినా ఇవి తగ్గుతాయి గాలి బాగా వచ్చే చోటున,పిల్లలను పడుకోబెట్టాలి. మరీ ఎక్కువగా ఉంటే వైద్యుల సలహా తో ఏదైనా క్రీమ్ పౌడర్ ఉపయోగించవచ్చు. పెద్దవాళ్లకు చెమటకాయలు వస్తే ప్రిక్లి హీట్ పౌడర్ వాడవచ్చు లేదా యాంటీ సెప్టిక్ పౌడర్ తో వీటిని నివారించవచ్చు.