Categories
పిల్లలు పెరుగుతూ ఉంటే వారికోసం ప్రత్యేకంగా గది ఏర్పాటు చేయటం మంచిదే . వాళ్ళకి వాళ్ళే గది సరుద్దుకోవటం క్లీన్ గా ఉంచుకోవటం అలవాటై పోతుంది . అలాగే ఆ ఏర్పాటుని చేసే గదిలో గాలి, వెలుతురు బావుండాలి . పుస్తకాల వారాల్లో ఆసక్తి కలిగించే అంశాలకు సంబంధించిన బుక్స్ ఉంచాలి . ఇండోర్ గేమ్స్ సంబంధించి కొంత సరంజామా ఉండాలి . ప్రత్యేకం గా వారు వారు తినేందుకు పోషకాలతో కూడిన పదార్దాలు అందుబాటులో ఉండాలి . డ్రైఫ్రూట్స్ నట్స్ గింజలు ,వేరుశెనగ పప్పు ఉండలు ,నువ్వుల ఉండలు ఓట్స్ తో సర్ది ఎదురుగా కనిపించేలా ఉంచాలి . చదువుకొనే సమయంలో కొంత రెప్రెష్ అయ్యే సమయంలో ఇవి తినేందుకు బావుంటాయి .