రకరకాల లిప్ బామ్ ,లిప్ స్టిక్ లతో పెదవుల చుట్టూ నలుపు పెరిగి,పెదవులు సున్నితత్వానికి మెరుపు పోగొట్టు కొని పొడిబారి కనిపిస్తాయి . ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో ఓ టేబుల్ స్పూన్ తేనే కలసి ఆ మిశ్రమాన్ని పెదవులను పట్టించి ఓ గంట ఆగి తుడిచేసి మళ్ళీ అప్లయ్ చేయాలి . ఇలా రోజుకు మూడుసార్లు చేయచ్చు అలోవెరా గుజ్జుతో కూడా మంచి ఫలితం ఉంటుంది . ఆపిల్ సిడార్ వెనిగర్ కూడా బాగా పనిచేస్తుంది . వెనిగర్ లో కాస్త నూనె కలసి దాన్ని పెదవులను అప్లయ్ చేసి పది నిముషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేయాలి . ఈ యాపిల్ సిడార్ లో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లానికి పైగ్మాన్టేషన్ తగ్గించే లక్షణం ఉంటుంది .

Leave a comment