ఒక చిన్న ఆలోచన ప్రపంచాన్ని మార్చేస్తుంది అంటే ఇలాటిదే.అమెరికా ఓక్లాండ్ నగరంలోని ఒక వీధి దోపిడీలు,మాదకద్రవ్యాలు,ఆకతాయులకు అడ్డాగా వుండేది. సెక్స్ వర్కర్స్ ఉండేవాళ్ళు దాన్ని చూసి ఆ వార్డులో నివసించే డాన్ స్టీవెన్ సన్ అన్న ఓ పెద్దమనిషి అక్కడో బుద్ధ విగ్రహాన్ని తెచ్చి రోడ్డు పక్కనే ప్రతిష్ట చేశాడు . ఆ బుద్దుని ప్రేమ పూరితమైన విధానం చూసి మారేరో,మరెందుకో గాని ఆ వీధిలో,స్థానికుల్లో మార్పు వచ్చింది. రోడ్డు పక్కనే చెత్త వేయటం మానేశారు. ఆకతాయిలు,దొంగలు నెమ్మదిగా అక్కడ నుంచి వెళ్ళిపోయారు మెల్లగా బుద్ధా భగవానుడి మందిరం వెలిసింది. ఆ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా మారిపోయింది. మన చుట్టు వాతావరణంలో మార్పు తేవాలి అనుకుంటే ఇలాటి చక్కని ఆలోచనలు వస్తాయి.

Leave a comment