Categories
ఇప్పుడు సన్నగా కనిపించాలి అనుకోవడం సహజం అయిపోయింది. 40 ఏళ్ళు వచ్చాక శరీరం కొలతలు మారటాయి. ఇంకా అందమైన చీరలు కట్టలేం అనుకుంటారు. కానీ చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే చక్కని చీరలు కట్టుకోవాచు. కాటన్, ఆర్గంజా చీరాల జోలికి వెల్లకూడదు. జార్జెట్, షిఫాన్, తరహా చీరలు ఎంచుకోవాలి. ప్రింటు, డిజైన్ చిన్నవిగా వుండాలి. ముదురు రంగులు ఎంచుకోవాలి. ముదురు రంగు చీరకు ప్రింటు బ్లవుజు ఎంచుకుంటే బావుంటుంది. ఏదీ జియోమెట్రిక్ డిజైన్ అయితే మరీ బావుంటుంది. మెరిసే బ్లావుజు, మెరిసే అంచులు ఎంచుకోవచ్చు. చీర ఎక్కడా ముడతలు లేకుండా కొంగు పొందిగ్గా పెట్టుకోవాలి. సింపుల్ గా వుండే నగలు, తేలిగ్గా వదిలేసిన జుట్టు తో అందమైన లుక్ రావడం ఖాయం.