ఎన్నో పార్టీలు, గెట్ టు గెదర్ లు చిన్న పాటి పుట్టిన రోజులు వస్తు ఉంటాయి. ఏ డ్రెస్ వేసుకోవాలి ప్రతి సారి అమ్మాయిలకు ప్రశ్న. సాధారణంగా ఆధునికంగా కనిపించాలని అనుకుంటారు. కష్ట సంప్రదాయకంగా ఉన్నా మేలే అనిపిస్తుంది. అలాటప్పుడు అనార్కలీలు చక్కని ఎంపిక. ఏవైనా కుర్తీలు బావుంటాయి. ఇప్పుడు చేనేత వస్త్రశ్రేణిలో కుట్టే ఏ డ్రెస్ లయినా హుందాగా ఉంటాయి. అలాగే కాటన్ కుర్తీలు బావుంటాయి. పొడవాటి గౌన్ లు, వాటికి ఎంబ్రాయిడరీ జోడింపులు  ఇటు అధినికంగా అటు సంప్రదాయకంగానే ఉంటాయి. పసుపు, నీలం, ఆకు పచ్చ, గులాబీ ఛాయలు బాగా నప్పుతాయి. వాటికి జతగా ట్రెండీగా వుండే వెండి నాగలు చెవులకు జుంకీలు చక్కని అందం ఇస్తాయి. ఏ డ్రెస్ అయినా ముడతలు పడకుండా నీట గా నలగకుండా కనబడితే చాలు. అందంగానే వుంటుంది.

Leave a comment