Categories
అంతగా పట్టించుకోము గానీ చిటికెడంటే చిటికెడు జల్లితే పదార్థాలకు ప్రత్యేక వాసన రుచి ఇచ్చే ఇంగువ చేసే మేలు అంతా ఇంతా కాదు. చెట్ల వేర్ల నుంచి లభించే ఇంగువ జీర్ణరసాలు ఉత్పత్తి అయ్యేందుకు తోడ్పడుతుంది. ఇంగువలో ఫాస్పరస్, క్యాల్షియం, ఇనుము, కెరోటిన్, విటమిన్-బి, పీచు, మాంసకృత్తులు పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచగల గుణాలున్నాయి వైరల్ ఇన్ఫెక్షన్లు రానివ్వవు. అల్లం ఇంగువ తేనె సమపాళ్లలో కలుపుకుని తాగితే గొంతు నొప్పి తగ్గిపోతుంది.