సేవింగ్స్ గురించి ఆలోచించగానే బంగారం గుర్తిస్తుంది . ప్రతి వాళ్ళు నగల పైన పెట్టుబడి పెట్టటం మంచిదే అంటారు . అయితే బంగారు నగలా ?. తొలి ప్రాధాన్యత వజ్రాల నగలకే అంటారు . వజ్రాల నగల వన్నె తగ్గదు . ధర తగ్గదు మార్పిడి సమయంలో నష్టపోవటం ఉండదు . బంగారంతో చేసిన లాంగ్ హారం కంటే మెడ దగ్గరగా ఉండే నెక్లె స్ కొనటం మేలు . పైగా వజ్రాల నగలు ట్రెండీగా ఉంటాయి . ఏడెనిమిది లక్షల్లో చూడ చక్కని నెక్లె స్ఎంచుకోవచ్చు . బిల్లు వేసే ముందర ఐ.జి .ఎ సర్టిఫికెట్ తీసుకోవాలి . బిల్లులో బంగారం,వజ్రాలు,తరుగు,తయారీ ఖర్చుల వివరాలన్ని ఉన్నాయో లేదా చూసుకోవాలి . నగల్లో వాడిన జాతి రత్నాలు ఎమరాల్డ్,ఓనెక్స్ … వాటిలో ఏ రకం తెలుసుకోవాలి . ఎమరాల్డ్ ధర ఎక్కువ ,ఓనెక్స్ ధర తక్కువ . వజ్రాల నాగ ఇటు ఆధునికంగా అటు సాంప్రదాయకంగా బావుంటుంది .
Categories