Categories
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని ఒట్టపాలెంకు గ్రామానికి చెందిన గీత సలీష్ కు 13 ఏళ్ల వయసులో చూపు పోయింది. పునరావాస కేంద్రంలో చేరి బ్రెయిలీ నేర్చుకుంది. సలీష్ కుమార్ తో పెళ్లయ్యాక ఆర్గానిక్ రెస్టారెంట్ తెరిచారు. ప్రసవానంతరం మహిళలకు ఇచ్చే మంజిల్ వరకియత్తు వంటి బలమైన ఆహారం కోసం పరిశోధనలు చేసి పచ్చి పసుపు, ఖర్జూరం, పాలు, బాదం, బెల్లం కలిపి తయారు చేసింది. గీతాస్ హోమ్ టు హోమ్ పేరుతో ఆమె పది రకాల ఉత్పత్తులను అమ్ముతోంది. రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకుంది గీత.