Categories
సబ్బులు కొనేటప్పుడు వాటి పైన జంటిల్ ,మైల్డ్ అన్న పదాలు ఉన్నాయా లేదా అని చూసుకొంటే ,అవి బాగా నురగ రాని వైన పర్లేదు శరీరం శభ్రం అవుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. సహజమైన ఉత్పత్తులు ఎప్పుడు ప్రయోజనకరంగా ఉంటాయి. మొహం తడిగా ఉన్నప్పుడే వాటిని అప్లైయ్ చేయాలి. నిజానికి ప్రతి రోజు సబ్బు వాడకం వల్ల చర్మానికి నష్టమే ప్రతి రోజు క్లెన్సర్ తో వాష్ చేసుకోవటం మంచిది. ఫేస్ స్క్రబ్ తో మృత కణాలు పోతాయి. సోడియం లారెల్ ,సల్ఫెట్ వంటి కఠినమైన డియోడ్రెంట్ సోప్స్ ని తప్పని సరిగా వదిలేయాలి. సరైన చర్మ రక్షణ కోసం సన్ స్క్రీన్ ప్రోటెక్షన్ క్రీమ్ వాడాలి. చిక్కని మాయిశ్చరైజర్లు ,జెల్స్ ఐ క్రీముల వల్ల అవి ప్రొటెక్టివ్ లేయర్ ను ఇచ్చి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.