Categories
బ్లాక్ కోల్డ్ వంటి ఎన్నో రకాల కాఫీల కంటే నెయ్యి వేసిన కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు ఎక్సపర్ట్స్. అమ్మాయిలు, మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఒక పెద్ద సమస్య. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది ఉత్తమ ఎంపిక. కాస్త కాఫీ లో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పరగడుపునే తాగితే శరీరంలో ఇన్సులిన్ శాతం పెరగదు. కెఫిన్ తో పెరిగే ఆందోళన కూడా ఈ నెయ్యి వేసిన కాఫీ తగ్గిస్తుంది. నెయ్యి ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం చేస్తుంది. శక్తి ఇస్తుంది. మెటబాలిజం మెరుగుపడాలి అంటే ఉదయం కొవ్వు ప్రోటీన్ల తో కూడిన ఆహారం తీసుకుంటే మంచిది అంటారు. ఈ కాఫీ తాగితే ఈ రెండు శరీరానికి అందుతాయి.