కోవిడ్ బారిన పడిన వారు త్వరగా కోలుకునేందుకు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి అంటోంది సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్. విటమిన్-సి జింక్ ఎక్కువగా ఉండే మాంసాహారం, మష్రూమ్స్, బ్రోకలీ తో పాటు అరటి పండ్లు నారింజ బత్తాయిలు కోవిడ్ డైట్ లో చేర్చుకోవాలి .ఉదయం అల్పాహారంలో నానపెట్టిన పప్పులు నట్స్ తప్పనిసరిగా తినాలి వేరుశెనగ, బాదం, జీడిపప్పు వాల్ నట్స్ తినవచ్చు .రాగులు ఓట్స్ లో బి- విటమిన్లు ఐరన్ పీచు చాలా ఎక్కువ  ఉదయం అల్పాహారం లో వీటితోపాటు గుడ్లు తీసుకుంటే కోవిడ్ నుంచి త్వరగా కోలుకుంటారు. పప్పు ధాన్యాలు బియ్యం కూరగాయలు సమ్మేళనం తో కిచిడి తరచుగా తినాలి మజ్జిగ పండ్ల రసాలు వీలైనన్ని ద్రవపదార్ధాలు తీసుకుంటూ ఉండాలి.

Leave a comment