Categories
కోవిడ్ కష్టకాలంలో కేరళ లోని లక్ష్మి మెనన్ కోవిడ్ పేషంట్ల కోసం పరుపులు తయారు చేసింది.ఆమె పర్యావరణ కార్యకర్త ఎర్నాకుళంలో ప్యూర్ లివింగ్ సంస్థ స్థాపించాలి. గతంలో వేస్ట్ పేపర్ తో పెన్నుల తయారీ వంటి ప్రయోగాలు చేసిన లక్ష్మి ఇప్పుడు సమాజహితమైన శయ్వలు తయారు చేశారు. పిపిఈ గౌన్ల తయారీ లో ఉపయోగించే నానా వోవన్ మెటీరియల్ తో ఈ పరుపులు చేశారు. ఈ గౌన్ల తయారీలో మిగిలిపోయిన మెటీరియల్ ను జడలుగా అల్లి మెలి తిప్పుతూ ఆరు అడుగుల పొడవు,నాలుగు అడుగులు వెడల్పు శయ్యను తయారు చేశారు.పిపిఈ గౌన్ల స్క్రాప్ తోనే ఇపుటికి రెండు వేల నాలుగు వందల పరుపులు తయారయ్యాయి. ఒక్క పరుపును మూడువందలకే ఇస్తోంది లక్ష్మి.