కోవిడ్ -19 వచ్చి కోలుకున్నాక కూడా ఆకలి తక్కువగా ఉండటం ఆహారం రుచించక పోవడం వల్ల నీరసంగా అనిపిస్తుంది. ఆహారంలో శక్తి నిచ్చే పిండి పదార్థాలు మంచి కొవ్వులు మాంసకృత్తులు జీవ వ్యవస్థ లన్నింటి పనితీరు సక్రమంగా ఉంచే విటమిన్లు ఖనిజాలు అన్నింటిని తగ్గ పాలలో తీసుకుంటేనే త్వరగా కోలుకో గలుగుతారు.ఉదయం అల్పాహారంలో గుడ్డు పాలు మొలకెత్తిన గింజలు పండ్లు తీసుకోవాలి.భోజనంలో రొట్టెలు, అన్నం, పప్పు, ఆకుకూరలు, కాయగూరలు, చికెన్, చేపలు వంటివి మాంసాహారం, పెరుగు ఉండాలి . స్నాక్స్ గా వేయించిన లేదా ఉడికించిన గింజలు బాదం అక్రోట్ అన్ని రకాల పప్పులు తీసుకుంటే  పోషకాలు శరీరానికి శక్తిని ఇస్తాయి.కనీసం ఏడు, ఎనిమిది గంటలు నిద్ర చాలా ముఖ్యం.

Leave a comment