400 వందల గంటలు పనిచేసి కరోనా పై అవగాహన తెచ్చే అందమైన డ్రెస్ రూపొందించింది టీనేజ్ అమ్మాయి పెటోన్ మెన్ కర్. డక్ట్ టేప్ ప్రెస్  డిజైనర్ గా ఇప్పటికే తనకు మంచి పేరుంది. ఈ డ్రెస్ కోసం 41 డక్ట్ టేప్ రోల్స్ ఉపయోగించింది పెటోన్. కరోనా వైరస్ నేపథ్యంలో ఒక డ్రెస్ డిజైన్ చేయాలనుకున్నాను. మారుతున్న పరిస్థితులను నా డ్రెస్ ద్వారా చెప్పాలనుకున్నాను. ఈ డ్రెస్ ఫేస్ మాస్క్ లు ధరించిన వైద్యులు కరోనా వైరస్ ప్రభావం తో పడిపోతున్న వ్యక్తులు అంటు వ్యాధి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నా వ్యక్తుల కనిపిస్తారు ఈ డ్రెస్ ధరించిన పెటోన్ మెన్ కర్ ను సోషల్ మీడియా లో చూసి అభినందనలు చెప్పేశారు నెటిజన్లు.

Leave a comment