సైకాలజిస్టలకు ఎవరినైనా వప్పించటం చాలా సులభం. ఈ ట్రిక్స్ ని అమ్మలు కూడా ఉపయోగించి పిల్లలకు ఎలా చెప్పినా వింటారు. ఏది చెయ్యమన్నా చేస్తారని చెపుతున్నారు . పిల్లల్ని వప్పించాలి. కోప్పడతారు . ఉదాహరణకు చేతులు కడుక్కోండి. శుభ్రంగా ఉండమని అరచి గీ పెట్టినా వినరు. సరదాగా కొన్ని రూల్స్ పెట్టాలి. చేతులు కడుక్కోవాలి అంటే ఎ మొదలుపెట్టి z  వచెట్లుగా అంకెలు పెద్దగా చదువుతూ కడుక్కురమ్మని అలాగైతే తాను అక్షరాలు ఎంత బాగా చెపుతున్నారో వినాలనుకుంటున్నానని  చెప్పాలి. అలాగే కొన్ని స్టిక్కర్స్ తెచ్చి పెట్టుకుని ప్రతి మంచి పనికి ఒక స్టిక్కర్ ఇస్తానని చెప్పాలి. ముందుగా ఆ స్టిక్కర్లు లేదా గిఫ్ట్ లు ఎదో చెప్పకూడదు. గిఫ్ట్ స్టిక్కర్ కావచ్చు. చాక్లేట్ కావచ్చు . అమ్మకే తెలియాలి . పిల్లలు కన్విన్స్ అవుతారు. జస్ట్ ఇలాంటివి ఒకటి రెండు ఉదాహరణకు మనసులో పెట్టుకుఇ పిల్లల్ని మంచి అలవాట్ల వైపు మళ్లించేందుకు తల్లులు సైకాలజిస్టులు అవతారం ఎత్తాలని చెపుతున్నారు.

Leave a comment