ఇంట్లో ఎన్నో వంట నూనెలు వాడుతుంటారు. వాటిలో దాదాపు అన్నీ సౌందర్య పోషణకు ఉపయోగపడతాయి. నువ్వుల నూనె దంత ఆరోగ్యం చిగుళ్లు బలంగా ఉండటం కోసం ఉపయోగించుకోవచ్చు. ఉదయపు వేళ ఈ నూనెతో చిగుళ్లు గట్టిగా  అద్ది రుద్దాలి. ఈ నూనెతో అలర్జీల భయం కూడా  లేదు. దంతాలు తెల్లగా ఉండేందుకు ఈ  నూనె ఉపయోగపడుతుంది. తలకు భృంగ రాజ్ ఆముదం కొబ్బరి నూనెలు చాలా మేలు చేస్తాయి. ఇవి అన్ని విడివిడిగా గాని అన్నీ కలిపి కానీ వాడచ్చు. అలాగే షాంపూ తో పాటు రెండు మూడు చుక్కల నూనె కలిపితే కండీషనర్ గా ఉపయోగపడుతుంది. ఆముదం కనుబొమ్మల వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు సాయపడుతుంది. రాత్రివేళ రెండు మూడు చుక్కల  ఆముదం కనుబొమ్మల వెంట్రుకలకు రాస్తే వెంట్రుకలు నల్లగా నిగనిగలాడతాయి. ముఖం పై మచ్చలకు విటమిన్ ఇ  నూనె చాలా బాగా పనిచేస్తుంది. చేతివేళ్ళు పొడిబారి గోళ్లు పెళుసుగా ఉంటే బాదం  నూనె తో మర్దనా చేస్తే చర్మానికి తేమ అంది చర్మం బావుంటుంది. పాదాలు ఇంతే ముందుగా గోరు వెచ్చని నీళ్లతో పాదాలు ముంచి శుభ్రంగా కడిగి తర్వాత బాదం  నూనె లేదా పెప్పర్ మెంట్ నూనెతో ఆలివ్ నూనె కలిపి రాసినా బావుంటాయి.

 

Leave a comment