వర్షకాలపు సీజన్ బాగానే ఉంటుంది కానీ వంటింల్లో వస్తువులు మాత్రం జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. బియ్యం ,పప్పులు,ఉప్పులు,స్పైస్ లో పురుగులు ,ఫంగస్ చేరుతాయి. బ్రెడ్ పైన పసుపు ఆకుపచ్చ కలసిన మల్ట్ కనిసిస్తుంది. కనుక సీజన్ అయ్యే వరకు చిన్న బ్రెడ్ ప్యాక్స్ తెచ్చుకోవాలి. ఉప్పు ,చక్కెర ఉన్నా సీసాల్లో చెమ్మ చేరకుండా కొన్ని బియ్యం గింజలు అ సీసాల్లో వేయాలి. బియ్యం డబ్బాలో కొన్ని కర్పూరం బిళ్ళలు చిన్న వస్త్రంలో కట్టి వేస్తే పురుగులు పట్టవు. మసాలా పొడిలో, కారం వంటి వాటిలో తెల్లని బూజు పొర వస్తుంది. ఆ డబ్బాల్లో బే ఆకులు వేయవచ్చు. కూరగాయలు కుళ్ళిపోకుండా న్యూస్ పేపర్ లో చుట్టి జిప్ లాగా బ్యాగ్స్ లో సీల్ చేసి ఉంచితే తాజాగా ఉంటాయి.

Leave a comment