జుట్టు కి పోషణ ఇచ్చేందుకు చక్కని నూనె ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.ఈ నూనెతో చుండ్రు కూడా తగ్గిపోతుంది జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది గుప్పెడు చొప్పున మందార పూలు ఆకులు, కలబంద గుజ్జు కప్పు, కొబ్బరినూనెలో మరిగించి చల్లారాక వడకట్టి  గాలి చొరబడని సీసాలో  భద్రపరుచుకోవచ్చు.రెండు రోజులకో  ఒకసారి ఈ నూనెతో జుట్టుకు మసాజ్ చేస్తే చుండ్రు అదుపులోకి వస్తుంది.జుట్టు రాలటం తగ్గిపోతుంది.అలాగే గుప్పెడు గులాబీలు, కప్పు చొప్పున మునగాకు కరివేపాకు, ఆముదం, కొబ్బరి నూనె తీసుకుని మరిగించి ఈ మిశ్రమం సగం అయ్యాక చల్లార్చి వడగట్టి సీసాలో భద్రపరుచుకోవచ్చు.దీన్ని తలకు పెట్టుకోని మర్దన చేసి ఓ గంటకి తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.చుండ్రు తగ్గుతుంది.

Leave a comment