Categories
బ్లూ బెర్రీస్ పండ్లు దంతాల సమస్యని సమర్థవంతంగా ఎదుర్కోంటాయంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. దంత క్షయ నివారణ కోసం వాడే మందుల కంటే ఈ పండ్లు ఎక్కువ ఉపయోగపడతాయి. దంతాల సమస్యలు ఉంటే ప్రతి రోజు బ్లూ చెర్రీ పండ్లు బ్రేక్ ఫాస్ట్ గా ,సాయంత్రం స్నాక్స్ గా తీసుకొంటే ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు . ఈ పండు లోని పోషకాలు విటమిన్లు దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు. గుండె సంబంధిత వ్యాధులు రాకుండాను ,కేన్సర్ వంటి ప్రాణాంతకమైన జబ్బులు దగ్గరకు రానీయకుండా చెర్రీస్ సాయ పడతాయంటున్నారు. అయితే ఈ పండు లో తీపి శాతం ఎక్కువగా ఉంటుంది కనుక మధుమేహాంతో బాధపడే వారు డాక్టర్ సలహాపైన ఈ పండు ను తీసుకోవాలిని చెపుతున్నారు.