Categories
అజంతా గుహలలో చిత్రాలు మనకు ఎన్నో కథలు చెపుతాయి . దంతుడు,అతని భార్య మణిమాల బుద్ధుని దంతాన్ని తీసుకోని లంకాధీశుడైన మహాసేనుడి కి ఇచ్చేందుకు వంశధార దాటుతు ఆ దంతం కోసం వెంటాడి వస్తున్న బీరదార్ మహారాజాకి దొరికిపోతారు . హేమమాల తన శిరోజాల అలంకరణ లో దాచినప్పటికీ శత్రువులు దాన్ని తీసుకొంటారు. దంతుడు ఆ బుద్ధుని కొర్ లేదా దంతాన్ని ఇచ్చేయమని ఎంతో ప్రాధేయపడ్డ తరువాత దాన్ని తిరిగి ఇస్తారు . ఆ దంపతులు సముద్ర మార్గం ద్వారా కృష్ణనది తీరంలోని తలగడ దివీ నుంచి బయలుదేరి శ్రీలంక చేరుకొన్నారు . అక్కడున్న కాండీస్తూపం లో ఇప్పుడీ దంతం ఉంది . ఈ కధ ఆధారంగా శ్రీలంక కు చెందిన చిత్రకారుడు . వాలి ముని సాహస్ మెండిస్ గీసిన చిత్రం ఇది . ఈ కళాఖండాన్ని చూసేందుకు పర్యాటకులు శ్రీలంక వెళతారు .