అరటి తొక్కే కధా అని తీసిపారేయండి పండుతోపాటు తొక్క కూడా చాలా విలువైంది అంటారు ఎక్సపర్ట్స్. శరీరంపైన దద్దర్లు వస్తే అరటి తొక్కతో రుద్దుతే పోతాయి. తొక్క లోపలి గుజ్జు గీరి తింటే మలబద్దకం సమస్య రాదు. అరటి తొక్క లోపలి భాగం తో పళ్ళను రుద్దితే పళ్ళ పై ఉన్న గార పోతుంది అరటి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ ముఖం పై గీతలు మరకలు తగ్గిస్తాయి. తొక్కను మెత్తగా గ్రయిండ్ చేసి,ఆ గుజ్జును కోడిగుడ్డు పచ్చసొన కలిపి ప్యాక్ వేస్తే చర్మం మెరిసిపోతుంది. ఇందులోని ల్యూటిన్ అనే మూలకం కళ్ళకు ఎంతో మేలుచేస్తుంది. సూర్యుని హానికర కిరణాలకు నల్ల గుడ్డు దెబ్బతినకుండా కాపాడుతుంది కళ్ళకు చెరుపు చేసే ప్రీ రాడికల్స్ తగ్గిస్తాయి. వయసు పెరిగేప్పుడు వచ్చే క్యాట్ రాక్ట్ ముప్పుతగ్గుతోంది. ఈ లోపల గుజ్జు పులిపిరి కాయలను నిర్ములిస్తుంది. ఈ తొక్కతో రుద్దితే వెండి ఆభరణాలు మెరిసిపోతాయి.
Categories