2002 లో విడుదలైన ట్రాప్ట్ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా హిందీలో డెడ్ లైన్ సిర్ఫ్ 24 ఘంటే చిత్రాన్ని రూపొందించారు డాక్టర్ వీరెన్ గోయెంకా ఒక అవార్డ్ తీసుకునేందుకు ఢిల్లీ కి వస్తాడు. అదే సమయంలో డాక్టర్ ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి అతని ఏడేళ్ల కూతురిని కిడ్నాప్ చేస్తారు. అక్కడ ఢిల్లీలో ఒక యువతి వీరెన్ ని కిడ్నాపర్ భార్య తన అదుపులోకి తీసుకొంటుంది. 24 గంటల్లో మూడు కోట్లు ఇవ్వకపోతే పిల్లను చంపేస్తామంటారు కిడ్నాపర్లు. 24 గంటల ఉద్రిక్త సమయం తర్వాత కిడ్నాపర్లు డాక్టర్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు కిడ్నాప్ చేశారని డాక్టర్ భార్యకు తెలుస్తోంది ఒక అమనాలీయ ప్రవర్తన ద్వారా కిడ్నాపర్ కొడుక్కి వైద్యం నిరాకరించి ఆ పిల్ల వాడి ప్రాణం పోయేలా చేస్తాడు డాక్టర్. ఈ సంఘటన వెనుక ఏం జరిగింది, కిడ్నాపైన పాపాయి ఇంటికి ఎలా చేరిందో ఈ సినిమా కథ. తప్పకుండా ఈ సినిమా చూడండి.
రవిచంద్ర.సి
7093440630