కృత్రిమ కాళ్లతోనే యోగా గురువు అయింది అర్పిత రాయ్. ఈ ఆన్ లైన్ యోగ టీచర్ కు 20 ఏళ్ళ వయసులో ఒక ప్రమాదంలో రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి .ప్రాణాలు కాపాడటం కోసం ఆమె రెండు కాళ్లు తొలగించారు కృత్రిమ కాళ్లు పెట్టారు .ప్రమాదం జరిగిన ఎనిమిది నెలల తర్వాత మెల్లగా అడుగులు వేయటం మొదలు పెట్టింది అర్పిత. ఫిజియోథెరపీ తో పాటు యోగా చేసేది. ఇంస్టాగ్రామ్ లో ఆమె పెట్టిన యోగ ఫోటోలు వైరల్ అయ్యాయి. కృత్రిమ కాళ్లు తెలిసేలా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూసి ఎంతో మంది ప్రముఖులు ఆమెను ప్రశంసించారు. మనల్ని మనం ప్రేమించుకుంటేనే,మనలోపాల్ని మనమే అంగీకరిస్తేనే జీవితాన్ని జయించగలం అనిపించింది నాకు అంటుంది అర్పిత. అలా అనుకున్నాకే నా భవిష్యత్తు నాకు కనిపించింది. అర్పిత శారీరకంగా మానసికంగా ఫిట్ గా ఉండేందుకు బరువు తగ్గించుకొంది ప్రతి వ్యాయామం కృత్రిమ కాళ్లతో చేయటం కష్టం కానీ ఎన్నోసార్లు విఫలం అయ్యేకే శీర్షాసనం దగ్గర నుంచి అన్ని వ్యాయామాలు ప్రాక్టీస్ చేసి,తను పడిన ఇబ్బందులు పోస్ట్ చేసేది అర్పిత. ఆమెకు ఎంతో మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆన్ లైన్ లో యోగ నేర్పుతోంది అర్పిత. ఎన్నో కాంటెస్ట్ లలో విజేతగా నిలబడింది. కాళ్ళు లేకపోయినా ఆత్మవిశ్వసం తో,ఎంతో కీర్తీ సంపాదించి తన ప్రత్యేకత నిలుపుకొన్న అర్పిత నిజమైన స్ఫూర్తి దాత.