భూమి ఆకాశం రెండు కలుసుకోవుకదా. కానీ బోలీవియా లో వుండే సాలర్ దే ఉయుని చూస్తే మటుకు అభిప్రాయం మార్చుకోక తప్పదు. ఇది ప్రపంచంలో కెల్లా అతి పెద్ద దయిన ఉప్పు గని. దీన్ని వైశాల్యం 10,582 చదరపు కిలో మీటర్లు ఎత్తు 3656 మీటర్లు. సముద్రం మట్టం కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి ఈ ఉప్పు నీటి గనులు అక్కడ వుండే నీటి సరస్సు లతో పూర్తిగా పలుచని పొరతో కప్పబడి వుంటాయి. వర్షాకాలంలో అద్దాల్లాగా అయిపోతాయి. ఎండాకాలంలో సరస్సు లోని నీరు ఆవిరై ఉప్పు మిగులుతోంది. ఈ ఉప్పు గనులపైనా ఎండా పడగానే పైన ఆకాశం ప్రతిబింబం ప్రతిఫలిస్తుంది. దీనితో ఆకాశం నేల కలసి వున్నాయనే బ్రాంతికలుగుతోంది. చాలా అందమైన దృశ్యం ఇది.

Leave a comment