అంతర్జాతీయ మార్కెట్ లో టన్ను కోటిన్నర రూపాయల పైనే ధర పలుకుతోంది ఎర్రచందనం. ఇది పరిమళభరితమైన చక్క కాదుకానీ దీని నుంచి తీసిన తైలాన్ని కాస్మెటిక్స్ లో వాడుతారు. ఇది చర్మాన్ని మెరిపింస్తుందని మొటిమలు మచ్చలు మొదలైనవాటిని తొలగిస్తుందని వయస్సు కనిపించ నివ్వదని అంటారు. ఈ చెక్కని ఒకలాటి రుచికోసం ఆల్కహాల్ తయారీలోనూ వాడతారు ఎర్ర చందనం పొడి తేనె లేదా రోజ్ వాటర్ కలిపి మచ్చలు మొటిమల పైన రాస్తే అవి క్రమేణా తగ్గుతాయి. విలాసవంతమైన ఫర్నిచర్ తో పాటు ఇటు అందం కోసం ఔషధ పరంగాను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ అరుదైన ఎర్రచందనాన్ని తూర్పు కనుమలలోని శేషాచలం అడవులు ఈ చెట్లు ఆవాసాలు.

Leave a comment