Categories
ఈ సీజన్ లో దొరికే తాటి ముంజల్ని ఒక్క రోజు కూడ వదలకుండ తినండి అంటున్నారు డైటీషియన్లు. ఆరోగ్యంగా బరువు అదుపులో పెట్టుకోవాలంటే ఈ తాటి ముంజలు రుచికరమైన మార్గం అంటున్నారు. వీటిలో స్వాభావికంగా ఉండే నీటి పాళ్ళు, పుష్కలంగా ఉండే ఖనిజాలు వడదెబ్బ నుంచి రక్షిస్తాయి. వీటిలో ఉండే పెట్రో కెమికల్స్ వల్ల వయసు పైబడిన లక్షణాలు తగ్గుతాయి. దీర్ఘకాల యవ్వనం సాధ్యపడుతుంది. ముంజల్లో ఉండే పొటాషియం పాళ్ళు రక్తపోటును నివారిస్తాయి. జీర్ణ వ్యవస్థని శుభ్రపరుస్తాయి. కాలేయం పై బడే ఒత్తిడిని తగ్గించి కాలేయానికి మంచి ఆరోగ్యాన్నిస్తాయి. బ్లడ్ క్లాట్స్ ని నివారిస్తాయి.