నిమ్మ ఎసెన్షియల్ ఆయిల్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి.నిమ్మ నూనె ఎయిర్ డిఫ్యూజర్ దీన్ని గదిలో స్ప్రే చేస్తే సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి.వంట గదిలో నుంచి ఘాటైన వాసన వస్తూ ఉంటే రెండు చుక్కల నిమ్మ, లావెండర్, రోజ్ నూనెలను కలిపి స్ప్రే చేస్తే పోతుంది. నిమ్మ నూనె లో కొన్ని చుక్కల ఆలివ్ నూనె కలిపి ఫర్నిచర్ తుడిస్తే చక్కగా మెరుస్తాయి. కొన్ని చుక్కల నిమ్మ నూనె దూది ఉండను పై వేసి దానితో వెండి ఇతర లోహపు వస్తువులు శుభ్రం చేస్తే కొత్తగా మెరుస్తాయి.

Leave a comment