Categories
జుట్టు పొడిబారిపోవడం నిర్జీవంగా మారడం వంటి సమస్యలకు కలబంధ చక్కని పరిష్కారం.కలబంద గుజ్జుకు స్పూన్ ఆలివ్ నూనె కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి పది నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే ఈ జెల్ లోని ఎంజైమ్ లు మృత కణాలను తొలగించి జూట్టుకు తేమను అందిస్తాయి. జూట్టు ఎదుగుదలకు కారణమయ్యే సహజసిద్ధమైన నూనెలు కుదుళ్ల నుంచే వెలువడతాయి.వీటిలో ప్రత్యేకమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.అలాటివే ఇరవై రకాల కలబందలోను దొరుకుతాయి.కప్పు కలబంద గుజ్జు లో పావు కప్పు ఉసిరిపొడి రెండు స్పూన్లు బాదం నూనె కలిపి తలకు ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.