Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2018/07/actress-sonali-bendre-diagnosed-with-high-grade-cancer-photos-pictures-stills.jpg)
సినిమాల్లో నవ రసాలు పండించే నటులు నిజ జీవితంలో వచ్చే ఆటు పోట్లుకు అంత ధైర్యంగా స్పందిస్తారన్న దానికి సోనాలి బింద్రే ఉదాహరణ. ఆమెకు క్యాన్సర్ సోకిన విసయం వెంటనే సోషల్ మిడియాలో అభిమానులతో పంచుకొంది .అందమైన పొడవాటి జుట్టును చికిత్స గురించి పొట్టిగా కత్తిరించి ఉంటే ఒక్క క్షణం కూడా కళ్ళని కన్నీళ్ళతో తడవనియ్యకుండా ధైర్యంగా ఉండి చుట్టు అయిన వాళ్ళు తోడుగా ఉంటే ,ప్రేమించే స్నేహితులు ధైర్యం చెపుతూ చుట్టు నిలబడితే క్యాన్సర్ ఏమిటి దేన్నైనా జయించగలనని ధైర్యంగా చెపుతుంది సోనాలి. చక్కని సినిమాలు చేసింది,పుస్తకాలు చదువుతోంది ,పిల్లల పెంపకం గురించి ఓ పుస్తకం రాసింది. ఈమె గురించి ఎంత చెప్పుకున్న తక్కువే .ఇప్పడు క్యాన్సర్ బాధితులకు ధైర్యం ఇస్తానంటోంది వైద్యం తీసుకొంటూ కూడా .